Monday, November 25, 2024

వ్యాక్సీన్‌ తప్పక వేయించుకోవాలి..

ముత్తారం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సీన్‌ను తప్పక వేయించుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ రాజమౌళి పేర్కొన్నారు. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కరోనా వ్యాక్సీనేషన్‌ ప్రక్రియను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. 45 ఏళ్ల వారందరికి కరోనా వ్యాక్సీన్‌ తప్ప వేయాలని సూచించారు. అలాగే మండలంలో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement