Saturday, November 23, 2024

ఓవైపు పరీక్షలు.. మరోవైపు వ్యాక్సిన్..

ఓదెల: ప్రస్తుత తరుణంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజల నుండి స్పందన ఎక్కువై ప్రభుత్వ ఆసుపత్రిలో సందడిగా మారింది. మండల కేంద్రమైన ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుండి జనం వచ్చి స్వయంగా పరీక్షలు చేయించుకొని వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి మొదటగా కోవిడ్‌ పరీక్షలు చేసిన అనంతరమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. 45 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్‌ కోసం ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ లావణ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు నడుచు కోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి దూరం పాటించాలని కోరారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కోవిడ్‌ భయంతో ప్రజలు స్వచ్ఛందంగా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుని వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement