సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్టు పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 4వ పట్టణ ప్రగతిలో భాగంగా 3వ వార్డ్ లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పెద్దపల్లి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వార్డులో మొక్కలు నాటి, ప్లాస్టిక్ వేరే కార్యక్రమాన్ని చేపట్టారు వార్డ్ లోనే విద్యుత్ , నీటి సమస్య , పారిశుద్ధ్యం తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు.పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తు ప్రతి రోజు ఉదయం ఇంటిలోని తడి, పొడి, ప్లాస్టిక్ కవర్లు వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్పెషల్ ఆఫీసర్ శివయ్య, కౌన్సిలర్ బిక్షపతి, వార్డ్ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement