రామగిరి: మండలంలోని కల్వచర్ల గ్రామంలో గల వందల ఏళ్ల అతి పురాతన ఉమామహేశ్వరస్వామి ఆలయంలో పదహారు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి షావుకారి రాజారాం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో గ్రామ ప్రజలు, భక్తులు, శ్రీ శివరామకృష్ణ భజన మండలి, పురప్రముఖులు, ఆలయ కమిటి సభ్యులు హాజరయ్యారు. ఆలయ అర్చకులు మహాదేవునికి పూలతో ప్రత్యేక పూజ నిర్వహించి నైవేధ్యం సమర్పించిన అనంతరం భక్తులకు పంచామృత తీర్థం, సిరా ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీ శివరామకృష్ణ భజన మండలి వారిచే శివనామస్మరణ, భక్తి పాటల భజన చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement