గోదావరిఖని(ప్రభ న్యూస్): గోదావరిలో రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులో చోటుచేసుకుంది. గోదావరిఖని శివారు ప్రాంతమైన నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు నీటిపై తెలియాడడంతో జాలర్లు మృత దేహాలను బయటకు తీశారు.
గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన నజీముద్దీన్ రెండు రోజుల క్రితం నదిలో దూకడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టినా దొరకకలేదు. రెండ్రోజుల తర్వాత మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మృత దేహాన్ని బయటకు తీయడానికి జాలర్లు వెళ్లిన సమయంలో మరో మృత దేహం కనిపించించింది. మరో మృతుడు శివాజీ నగర్ కు చెందిన కొయ్యడ రాకేష్ గా గుర్తించారు.