పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, టైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆధ్వర్యంలో మండలంలోని రాఘవాపూర్ ట్రాన్స్‌ఫార్మర్స్ రిపేర్ సబ్‌స్టేషన్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం విద్యార్థులకు పవర్ ట్రాన్సిమిషన్ ,ట్రాన్స్‌ఫార్మర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా పెద్దపెల్లి ఏడీఈ సుగుణయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సబ్ స్టేషన్ నిఖిల్‌లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సబ్ స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్స్ ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ట్రాన్స్‌ఫార్మర్స్ బ్రేకర్ తదితర విషయాలపై వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement