Thursday, September 19, 2024

ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ ప్రభంజనం.. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు

ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కరీంనగర్, పెద్దపల్లి ట్రినిటీ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి మరోసారి కరీంనగర్ ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో నిలపడం జరిగింది. జూనియర్ ఇంటర్ ఏంపిసిలో 467 మార్కులతో ఇద్దరు విద్యార్థులు సంజుశ్రీ ,కే వైష్ణవి రాష్ట్రస్థాయి ప్రథమ మార్కు సాధించారు. 466 మార్కులు 13 మంది విద్యార్థులు సాధించడం జరిగింది.

జూనియర్ బైపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు అర్షిత ,తేజస్విని 437 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది .436 మార్కులు ఐదుగురు విద్యార్థులు ,435 మార్కులను 13 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. జూనియర్ సి ఈ సి విభాగంలో 500 మార్కులకుగాను 492 సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది దీనితోపాటు 488 ,487 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ ఈ విభాగంలో వైష్ణవి రాష్ట్రస్థాయి 991 మార్కులు, సహస్ర 990 మార్కులు రెహమాన్ 989 మార్కులు సాధించడం జరిగింది . వీరితో పాటు 988,987,986,985 మార్కులు సాధించడం జరిగినది. సీనియర్ బైపీసీ విభాగంలో వి. పూజిత రాష్ట్రస్థాయి 991 మార్కులు సాధించడం జరిగింది. మరియు 985 మార్కులు ముగ్గురు 984 మార్కులు ఐదుగురు విద్యార్థులు సాధించడం జరిగినది.

సీనియర్ సిఇసి విభాగంలో 968 మార్కులు సి.హెచ్ .ఆకాంక్ష 967 మార్కులు లలిత సాధించడం జరిగినది. సీనియర్ ఏం ఈ సి విభాగంలో శ్వేతన్ కుమార్ 977మార్కులు , అమూల్య 967 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచినారు. అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్ లు అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement