Thursday, November 21, 2024

పది ఫలితాల్లో ట్రినిటీ హవా… 59 మందికి 10 జీపీఏ

పదవ తరగతి ఫలితాల్లో ట్రినిటీ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం సైతం పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో 10 జీపీఏ సాధించారు. గురువారం ప్రకటించిన ఫలితాల్లో ట్రీనీటి పాఠశాలకు చెందిన 59 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి రికార్డు సృష్టించారు. పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు 9.8 జిపిఏ సాధించగా 47 మంది విద్యార్థులు 9.7 మరో 40 మంది విద్యార్థులు 9.5 జిపిఏ సాధించడం విశేషం. ఫలితాల అనంతరం ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పాఠశాల సత్తా తెలియజేస్తుందన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాల అనుగుణంగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా తినిటి విద్యాసంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందుకు విద్యార్థులను సిద్ధం చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 10 జిపిఎ సాధించిన విద్యార్థులను ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement