రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించగా 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ యువత రక్తదానం చేయడం అలవాటు పరచుకోవాలని, మనం చేసే రక్త దానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ డాక్టర్ నాగేంద్ర సింగ్, ఏవో రాధాకృష్ణ తోపాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement