పెద్దపల్లిరూరల్: నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన మున్సిపల్ కమిషనర్ తిరుపతితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రానున్న వర్షాకాలం కోసం మొక్కలను సిద్ధం చేసే దిశగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం, అధికారుల సూచనలు పాటిస్తూ మొక్కల పెంపకాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంఈఈ సతీష్, వర్క్ ఇన్స్‌పెక్టర్ మీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement