పెద్దపల్లి : ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. మంగళవారం ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో రొడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు జైలు శిక్ష తప్పదన్నారు. అతివేగంం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడంతోపాటు ఎందరో క్షతగాత్రులవుతున్నారన్నారు.
మద్యం సేవి చి వాహనం నడపవద్దని, జిల్లాలో ప్రతినిత్యం డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మైనర్లకు వాహనాలివ్వొద్దని, ఒకవేళ వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతోపాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. 80 కి.మీ కన్నా వేగంగా వెళితే జరిమానాలు తప్పవన్నారు. వాహనదారులు ఖచ్చితంగా ధృవీకరణపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల గురించి తెలుసుకోవడంతోపాటు వాటిని పాటించి ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఈసమావేశంలో ఏసీపీ సారంగపాణి, సీఐ లు ప్రదీప్‌కుమార్, అనిల్‌కుమార్, ఎస్‌ఐ రాజేశ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.