పెద్దపల్లి : జిల్లాలోని అంతర్గాం మండలం లింగాపూర్‌లో తండ్రిని కొడుకు చంపిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనిగల రవి మద్యం తాగొచ్చి గురువారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. వారిద్దరిని సముదాయించేందుకు కొడుకు శివ ప్రయత్నం చేయగా ఎంతకీ తండ్రి వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శివ.. అతనిపై కత్తితో దాడిచేశాడు. దీంతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.