రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కాపులపల్లికి చెందిన పలు పార్టీల నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అయిపోయిందని, పెద్దపల్లిలో సైతం హ్యాట్రిక్ విజయం తధ్యయమన్నారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 40ఏళ్లలో జరగని అభివృద్ధి తోమ్మిదేళ్లలో చేసి చూపామన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రతినిత్యం గులాబీ దండులో చేరుతున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యపు ఆరోపణలు చేసినా.. నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.