Friday, November 22, 2024

బాధితులకు డబ్బులు చెల్లించాలి.. తీన్మార్ మల్లన్న డిమాండ్

రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం సిగ్గుచేటని.. వెంటనే బాధితులందరికీ డబ్బులు వాపస్ చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులు అప్పులు చేసి ఉద్యోగాలు వస్తాయని లక్షల రూపాయలు చెల్లించారని, వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్తున్నారని, సంబంధం లేకుంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం బాధితులకు డబ్బులు చెల్లించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. నిజాయితీ ఉంటే అమరవీరుల స్థూపం వద్ద లేదా ఆబిడ్స్ చౌరస్తాలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బాధితుల నుండి డబ్బులు తీసుకున్న అధికార పార్టీ నాయకులు వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే తో ప్రతినిత్యం కలిసి ఉండే కార్పొరేటర్లే తమ ఆఫీస్ కు వచ్చి కాళ్లు మొక్కి క్షమాపణలు చెబుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement