Friday, November 22, 2024

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం : పెద్దపల్లి డీసీపీ రూపేష్

శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల అధ్యయమని పెద్దపల్లి ఇన్ చార్జి డీసీపీ చెన్నూరి రూపేష్ పేర్కొన్నారు. ఆదివారం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలతో మమేకమై పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన డిసిపికి పెద్దపల్లి ఏసిపి లు సారంగపాణి, గిరి ప్రసాద్, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, రాజవర్దన్, మహేందర్, అశ్విని తో పాటు సిబ్బంది మొక్కలు అందించే స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement