ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు తెలియజేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐలు, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా సీపీని కలసి మొక్కలను అందజేశారు. అనంతరం మంచిర్యాల డీసీపీ, ఏసీపీ లతో సమీక్ష నిర్వహించి రామగుండం పోలీస్ కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి, తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.