Friday, November 22, 2024

అస్సాం ముఖ్యమంత్రి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వాస్ శర్మ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో డిసిసి అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ,టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్ లు ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైసింగ్ సెక్రటరీ భూషనవేని రమేష్ గౌడ్, టిపిసిసి ఎస్సిసెల్ స్టేట్ కన్వీనర్ పెర్క సంతోష్,టిపిసిసి మైనారిటీ సెల్ స్టేట్ కన్వీనర్ ఫయాజ్, పెద్దపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లగొండ కుమార్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బండారి సునిల్ గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు కల్వల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు భూషనవేని సురేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కాంగ్రెస్ దొడ్డుపల్లి జగదీష్, కౌన్సిలర్ భూతగడ్డ సంపత్,తూముల శభాష్, కాంగ్రెస్ నాయకులు శ్రీమాన్,బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement