Friday, September 20, 2024

TG | కరీంనగర్‌కు డీజీపీ రాక..

కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ మంగళవారం కరీంనగర్ కు రానున్నారు. డిజిపి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం అధికారులకు పలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధికారులతో పాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లా అధికారులు సైతం పాల్గొనే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement