ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇవాళ స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ప్రజలు తెల్లవారు జామునుండే ఆలయాల వద్దకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని ముక్కులు చెల్లించారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకుంటే సుఖసంతోషాలు దక్కుతాయని ప్రజలు ప్రగాఢ నమ్మకంతో ఆలయాలకు చేరుకున్నారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.