ఓదెల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- అనంతరం అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తు కృషి చేస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డ ఇంట్లో వెలుగులు నింపుతోందని, సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిండి పోయారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం కళ్యాణ్ లక్ష్మీ చెక్కులు అందుకున్న లబ్దిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దాసరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి కునారపు రేణుకదేవి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ రమేష్, ఎంపిడివో సత్తయ్య, ఆర్‌ఐ రాజేందర్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కావటి రాజు, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆకుల మహేందర్, చిన్నస్వామి, ఆరెల్లి మొండయ్య, పిట్టల రవి, కిషన్ రెడ్డి, గుండేటి మధు, పోతుగంటి రాజు, కనికిరెడ్డి సతీష్, తీర్థాల కుమార్, బుద్దే పోశెట్టి, బోడకుంట నరేష్, పొలేపల్లి బుచ్చిరెడ్డి, వస్త్రం నాయక్, శ్రీకాంత్ గౌడ్‌లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement