Monday, November 11, 2024

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం.. ఎమ్మెల్యే దాసరి

ఓదెల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఓదెల మండల పరిషత్‌ కార్యాలయంలో 57 మందికి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ పేద ప్రజల కోసం ప్రవేశ పెడుతున్న పథకాలు ఎంతో గొప్పగా అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలు అదృష్టవంతులని దేశ ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఉత్సాహ పడుతున్నాయన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. పేద ప్రజల కోసం గతంలో ఏ ప్రభుత్వాలు ఒక పైసా కూడా కేటాయించలేని, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ చేస్తున్న పనులను అందరూ గమనించి దీవించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిపి రేణుకాదేవి, తహశీల్దార్‌ రమేష్‌, పొత్క పల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ఐ రాజేందర్‌, సర్పంచ్‌లు ఆళ్ల రాజిరెడ్డి, గుండేటి మధు, కర్క మల్లారెడ్డి, పల్లె ఓదెలు, తిరుపతి రెడ్డి, కొమురయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు కావటి రాజు, మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్‌, చిన్నస్వామి, రెడ్డి శ్రీనివాస్‌, ఆరెల్లి మొండయ్య, జీల తిరుపతి, పిట్టల రవికుమార్‌, ఢిల్లీ శంకర్‌, వస్త్రంనాయక్‌, గుంటి శ్రీనివాస్‌, కిషన్‌ రెడ్డి, కనికిరెడ్డి సతీష్‌, తీర్థాల కుమార్‌, గుర్రం పద్మలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement