తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ సీపీగా పనిచేసి బదిలీ అయిన సత్యనారాయణకు శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వీడ్కోలు సమావేశం, కొత్త సీపీ సుబ్బారాయుడుకు స్వాగత సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ సత్యనారాయణను సన్మానించి సుబ్బరాయుడికి బొకే అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయ అందించిన సేవలను అభినందించారు. సుబ్బా రాయుడు కరీంనగర్ వోఎస్డీగా పని చేసి ఇక్కడకు సీపీగా రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement