Friday, November 22, 2024

తెలంగాణలో అలీబాబా నలబై దొంగల పాలన .. తరుణ్ చుగ్

తెలంగాణలో అలీబాబా నలబై దొంగల పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. ఇటీవల మరణించిన బండి సంజయ్ అత్తకు నివాళులర్పించేందుకు తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కరీంనగర్ లోని బండి నివాసానికి చేరుకున్నారు. అక్కడ చెట్ల వనజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ అదేశాల మేరకే రాజ్యాంగ విరుద్ధంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేశారన్నారు.

మీరు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని, రాజ్యాంగ బద్దంగా ఉంటామని ప్రమాణం చేసారని గుర్తుచేశారు. నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తుందని, ఎంపీకే వారెంటు లేకుండా అరెస్ట్ చేశారని, సామాన్యుని పరిస్థితి ఏమిటని అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుందన్నారు. నిరుద్యోగుల కోసం బండి పోరాటం ఆగదన్నారు. లిక్కర్ మాఫియా లూటీ మాఫియాతో పాటు పేపర్ లీక్ మాఫియా నడుస్తుందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బండిని అరెస్ట్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు ప్రేమెందర్, రామచందర్ రావు, మనోహర్ రెడ్డి, ప్రభాకర్, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement