Friday, September 20, 2024

రక్షణ మరచిన సింగరేణి యాజమాన్యం

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి యాజమాన్యం కార్మికుల రక్షణను మరిచి అనవసరపు విషయాలపై దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని టీబీజీకేఎస్‌ నాయకులు అయిలి శ్రీనివాస్‌, కొత్త సత్యనారాయణరెడ్డి, శంకర్‌ నాయక్‌లు పేర్కొన్నారు. ఓసిపి త్రీ డంపర్‌లలో ఎఫ్‌ఎం రేడియోలను తీసి వేస్తున్న సందర్భాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రక్షణకు సంబంధించి రోడ్ల విషయంలో, దుమ్మును అరికట్టడంలో, ఫైర్‌ కోల్‌ నిరోధించడంలో గాని, మిషనరీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అందించడంలో గాని కార్మికులకు కావలసిన సేప్టీn పరికరాలను అందించడంలో ఎప్పుడూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికులు ఇబ్బంది పెట్టడానికి మాత్రమే సింగరేణి యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేయడం జరిగిందని, వెంటనే సర్క్యులర్‌ ను విరమించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి ఎట్టంకృష్ణ, భేతి చంద్రయ్య, విజేందర్‌రెడ్డి, సిరంగి శ్రీనివాస్‌, మేకల శ్రీనివాస్‌, బొద్దుల నరసయ్య, అయిలి గట్టయ్య, సంపత్‌, రాజేశం, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement