రామగుండం పట్టణంలోని బి పవర్ హౌస్ వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం, టాటా ఏసీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒక మెకానిక్ దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్ (25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి.. అక్కడికక్కడే మృతి చెందాడు. రామగుండంకు చెందిన మృతుడు ఎన్టీపీసీలోని గరుడ మోటర్ లో మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం విధుల కోసమని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం ఎస్ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..