Friday, November 22, 2024

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ..

పెద్దపల్లి: స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు సాగాలని, తద్వారా స్వచ్ఛ పెద్దపల్లిని సాధించేలా దోహదపడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన నూతన ట్రాలీలను ఎమ్మెల్యే దాసరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య సిబ్బందికి అందించి తమకు సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలన్నారు. కరోనా కేసులు ఉధృతమవుతున్న తరుణంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమత రెడ్డి, కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement