Saturday, November 23, 2024

సుశీ ఇన్‌ఫ్రా వద్ద నిరుద్యోగుల ఆందోళన..

యైటింక్లయిన్‌కాలనీ : భూనిర్వాసితులను, ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సమస్య పరిష్కారం అయ్యేవరకు పనులు సాగనివ్వబోమని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, నిర్వాసిత గ్రామాల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓసీపీ-3 సుశీ ఇన్‌ఫ్రా వద్ద ఆందోళన చేపట్టారు. నిబంధనల ప్రకారం 80 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగ నియామకాలు చేపడుతున్నారని, పాత కార్మికులందరినీ తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి సంస్థ పెద్దంపేట్‌, సింగిరెడ్డిపల్లె నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. ప్రభావిత గ్రామాల, నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో పనులు సాగనివ్వబోమని, తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే ఓబీ పనులు నిర్వహించాలంటూ పనులను అడ్డుకున్నారు. దీంతో ఓసీ-3 ఫేజ్‌-2లో సుశీ ఇన్‌ఫ్రాలో పనులు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో టీ-ఆరెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శంకేసి రవిందర్‌, పెద్దంపేట్‌ సర్పంచ్‌ నాగరాజు, ఎంపీటీ-సీ కామ శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీమ్‌, టీ-ఆరెస్‌ పట్టణ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్‌, కాపురబోయిన భాస్కర్‌, సతీష్‌, టీ-ఆరెస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు గారబోయిన నరేష్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ- డైరెక్టర్‌ బాబర్‌, నాయకులు మల్లెపల్లి రవిందర్‌, నానువాల సంపత్‌, నర్సయ్య ప్రభావిత గ్రామాల నిరుద్యోగులు, ఆర్వీఆర్‌ పాత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement