Sunday, November 17, 2024

గ్యాస్ లీకేజ్ లు పునరావృతం కాకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలి : కోరుకంటి చందర్

రామగుండం ఎరువుల కర్మాగారంలో గ్యాస్ లీకేజ్ కాకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుండి అమ్మోనియా లీకేజీతో పాటు ఆర్.ఎఫ్.సి.ఎల్ వ్యర్థ నీరు గోదావరినదిలో కలవటం మూలంగా గోదావరి నది కలుషుతం అవుతుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ‌ఈ క్రమంలో గురువారం హైదరాబాద్లో రాష్ట్ర కలుష్య నియంత్రణ మండలి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎరువుల కార్మగారం నుండి గ్యాస్ లీకేజ్ లేకుండా అధికారులు చూడలన్నారు. ఎరువుల కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి సమయంలో యాజమాన్యం నిర్లక్ష్యంతో అమెానీయ గ్యాస్ లీకేజ్ అవుతుందన్న‍ారు. గ్యాస్ లీకేజ్ ప్రజలు తీవ్ర అనారోగ్యంతో పాటు ఉపిరాడక అస్వస్థత గురైతున్నరని
గ్యాస్ లీకేజ్ కాకుండా చూడాలన్నారు. ఎరువుల కర్మాగారం నుండి వెలువడుతున్న వరద నీరు నేరుగా గోదావరి నదిలో కలవడం మూలంగా గోదావరి నది కలుషితం అవుతుందని అన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ ననుంచి వెలువడుతున్న నీరు గోదావరి నదిలో కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement