Tuesday, November 19, 2024

సమస్యల పరిష్కారానికి కృషి-తాసిల్దార్ అనుపమ

ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ అనుపమ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగి లబ్ధిదారులకు చేరేలా చూస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ అనుపమ కు కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ సంపత్, జడ్పిటిసి తిరుపతి రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement