Saturday, November 23, 2024

శబ్ద కాలుష్య నివారణకై ప్రత్యేక డ్రైవ్…

వాహనదారులకు జరిమానాలు విధించిన పోలీసులు
సుల్తానాబాద్ : అధిక శబ్దంతో రవాణా సాగిస్తున్న వాహనాలకు పోలీసులు భారీ జరిమానాలు విధించారు. బుధవారం మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ సమీపాన రాజీవ్ రహదారిపై అధిక శబ్దంతో ప్రయాణం చేస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొని శబ్దాలు వచ్చి హారన్ లను తొలగించారు అనంతరం వాహనదారులకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా సిఐలు ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాలకు కంపెనీలు ఏర్పాటు చేసిన ఆరన్ కాకుండా అధికంగా శబ్దం వచ్చే హారన్ లను బిగించి శబ్ద కాలుష్యం చేస్తున్న వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు ఇకముందు తరచూ దాడులు నిర్వహిస్తామని వాహనదారులు ఎట్టి పరిస్థితిలో అధిక శబ్దం వచ్చే హారన్ లను బిగించవద్దని తక్షణమే వాటిని తొలగించాలని అన్నారు ద్విచక్ర వాహనదారులు అధికంగా శబ్దం వచ్చే బుల్లెట్ యమహా కు ఉన్న సైలెన్సర్లను తొలగించాలని సూచించారు అలాగే ప్రతి వాహనదారులు విధిగా ధ్రువీకరణ పత్రాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అశోక్ రెడ్డి వినీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement