సిరిసిల్ల, నవంబర్ 9 (ఆంధ్రప్రభ): పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పేర్కొన్నారు. శనివారం పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటు-ంబ సభ్యులకు శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు- చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ వైద్య శిబిరాన్ని ప్రారంభించి పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో అధికారులకు, సిబ్బందికి, వారి కుటు-ంబ సభ్యులకు సీబీపీ, ఈసీజీ, 2 డి ఎకో, కంటి, ఎముకలు, న్యూరో, గుండె సంబంధిత సమస్యలకుపలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్య సిబ్బంది పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు అందుబాటు-లో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని, పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతోపాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటు-న్నారని తెలిపారు. సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులు, యోగా, క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని, ప్రజలకు నిష్కళంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు. పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగవంటివి దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. అధికారులకు, సిబ్బందికి వారి కుటు-ంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎల్‌వీ ప్రసాద్, అశ్విని హాస్పిటల్, తారక రామ హాస్పిటల్, కృష్ణ న్యూరో హాస్పిటల్, కొనార్క్ హాస్పిటల్ వైద్యులకు, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు, సిబ్బంది, కుటు-ంబ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.