Saturday, November 23, 2024

TS: ఓటర్లలో స్వేచ్ఛను పెంచేలా ప్రత్యేక కార్యాచరణ.. సీపీ రెమా రాజేశ్వరి

గోదావరిఖని, అక్టోబర్‌ 24 (ప్రభన్యూస్‌): ఓటర్లు ఎలాంటి భయాందోళనకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులతో సీపీ రెమా రాజేశ్వరి బ్రీఫింగ్‌ సెషన్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు రామగుండం కమిషనరేట్‌ పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్‌ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా, ఓటర్లు భయాందోళనలకు అవకాశం లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసేలా భరోసా కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా ఫ్లాగా మార్చ్‌, రూట్‌ మార్చ్‌లు నిర్వహిస్తామని, ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత బందోబస్త్‌ విధులు నిర్వర్తించాలని, ఎన్నికల రోజు ఎల్‌డబ్ల్యూఈ పోలింగ్‌ స్టేషన్‌లు, క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌ లలో స్టాటిక్‌ బందోబస్త్‌, మిగతా ఫోర్స్‌ రూట్‌ బందోబస్త్‌, అత్యవసర పరిస్థితి సమయంలో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఎస్‌ఎస్‌టీ టీమ్స్‌ డ్యూటీలు, ఎల్‌డబ్ల్యుఈ ఏరియాలో ఏరియా డామినేషన్‌, కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌, విధుల గురించి వివరించారు. కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్‌ ఫోర్స్‌ సిబ్బందిని ఉంచడం జరుగుతుందన్నారు. కేంద్ర బలగాలు ఉండడానికి సరైన వసతి ఏర్పాట్లు చేయాలని, వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ సుధీర్‌ కేకన్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ రియాజ్‌, అడిషనల్‌ కమాండెంట్‌ దినేష్‌ కుమార్‌, డిప్యూటీ కమాండెంట్‌ మాంజిమ కురియాకోసే, అసిస్టెంట్‌ కమాండెంట్‌ మంజుల, సంఘమితిరై, దీపిక, ఏసీపీలు ఎడ్ల మహేష్‌, తులా శ్రీనివాసరావు, తిరుపతి రెడ్డి, సదయ్య, మోహన్‌, మల్లారెడ్డి, నర్సింహులు, వెంకటేశ్వర్లు, ఏఆర్‌ ఏసీపీలు మల్లికార్జున్‌, సుందర్‌ రావు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement