100 సంవత్సరాల ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యం
వైద్యులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
సుల్తానాబాద్, ఆగస్టు 3 (ప్రభ న్యూస్): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే ఆసుపత్రిలో అన్నిరకాల సేవలు అందించే విధంగా కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యుల, నర్సుల, రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణ కలియతిరిగి రోగులకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణ ఇన్వార్డ్ జనరల్ వర్డ్ వైద్యుల గదులను ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నైజాం కాలం నుండి దాదాపు 100 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తుందని ఈ ఆస్పత్రి అభివృద్ధి కోసం తాను 2009 లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే పాత తాలూకా ఆసుపత్రి అభివృద్ధి కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు కృషి చేశానని తెలిపారు. ఆసుపత్రిలో అన్నిరకాల సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఈసీజీ స్కానింగ్ టుడీకో లాంటి సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేశామని త్వరలోనే దానిని ఆధునికరించి అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యులు కొందరు లీవ్ పై ఉన్నారని ఒకరు పెద్ద పెళ్లికి బదిలీ అయ్యారని మరి కొందరు అందుబాటులో లేకపోవడం వివిధ కారణాల దృష్ట్యా హాజరు కాలేదని డ్యూటీలో ఉన్న మరికొందరు వైద్యులు సేవలు అందిస్తున్నారని అలాగే నర్సుల 13 మంది ఉండాల్సి ఉండగా ఉన్న నర్సుల సేవలను వినియోగించుకుంటున్నామని త్వరలోనే పూర్తిస్థాయిలో నర్సులు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వర్షాల దృష్ట్యా జరాలు చికెన్ గున్యా లాంటివి వస్తున్నాయని డెంగు మలేరియా లాంటి జరాలు లేవని పేర్కొన్నారు. దాదాపు రెండు మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని త్వరలోనే అన్ని రకాల ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, ముత్యాల రవీందర్, దన్ నాయక్ దామోదర్ రావు,కల్లేపల్లి జానీ,వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, వార్డు కౌన్సిలర్లు దున్నపోతుల రాజయ్య, మమ్మద్ నిషాద్ రఫీక్, కుమార్ కిషోర్, మేడి శ్రీనివాస్, గదాసు రవీందర్, అమీరీ శెట్టి రాజలింగం, పన్నాల రాములు, అమీరి శెట్టి తిరుపతి, ఫరూక్, అమీనోద్దీన్, లతోపాటు డాక్టర్ల బృందం రమాదేవి, వైద్య సిబ్బంది తో పాటు పలువురు పాల్గొన్నారు.