కేసీఆర్ భరోసా ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు డమ్మీ అయిపోయాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బంధం పల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు గూలాబీ గూటిలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ… కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని కేసీఆర్ భరోసాలో పొందుపరిచిన 17 హామీలనే ప్రజలు నమ్ముతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బారాస అధికారంలోకి రాగానే 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందుతుందని, ఆసరా పింఛన్ 5000 కు పెరుగుతుందని, వికలాంగుల పింఛన్ 6000 కు పెంచుతామని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. బందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దామోదరి సది, కలవేన తిరుపతి, పొలకాని సాయి, పొలకాని శ్రీనివాస్, ఇటుకల రాజేశం, కలవేన భూమయ్య, పెసరి లచ్చయ్య, బొజ్జ శంకర్, నక్క కుమార్, కుక్క మహేష్, కుక్క లచ్చయ్య, శనిగారపు శ్రీనివాస్, మందపల్లి సురేష్, దుర్గయ్య, శేఖర్, నవీన్, సందీప్, వినోద్, శ్రావణ్, శ్రీనివాస్, రాజు, సంపత్, సందీప్ లు బిఆర్ఎస్ లో చేరగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈరబోయిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మాదాసు రవీందర్, మాదాసు ప్రసాద్, దామోదరి శ్రీనివాస్, కలవేన రాజమౌళి, ఎనగందుల రాజ్ కుమార్, ఇరవేన రాకేష్, నక్క శంకర్, కుక్క నాగరాజు, గరిగే సురేష్, పిడుగు వేణు, ఉప్పులేటి నర్సింగ రావు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.