రామగిరి: ఆర్జీ3 ఓసీపీ1 సీహెచ్‌పి లో కాంట్రాక్ట్ కార్మికులకు సబ్సిడీ పద్ధతిలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎప్టిఎన్ యు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపి విధులను బహిష్కరించారు. అనంతరం సిహెచ్పి డిజిఎం శ్రీనివాస్‌కి వినతిపత్రం అందించారు. సింగరేణి యాజమాన్యం చట్టపరంగా కల్పించాల్సిన సౌకర్యాన్ని రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు సబ్సిడీ పద్ధతిలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ. వెంకన్న, రీజియన్ అధ్యక్షులు బి. అశోక్, కార్మికులు సత్తి, మోహన్, చిన్న రాజయ్య, పెద్ద రాజయ్య, తిరుపతి, లక్ష్మణ్, మల్లయ్య, సంతోష్, గట్టు మురళి, పి. రాజయ్య, మధునయ్య, సమ్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement