కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పద్మశాలి సమాజం వారి ఆనవాయితీగా వస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారికి పద్మశాలీలచే సమర్పించే తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, సారే సమర్పణ జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ప్రారంభించారు. టిటిడి కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన శోభాయాత్ర రాజీవ్ చౌక్ మీదుగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వరకు నిర్వహించారు. మహిళలు భక్తి భావంతో కోలాటలు, వివిధ రకాల పాటలతో నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. గోవింద నామ స్మరణతో వీధులన్నీ మారుమోగిపోయాయి. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ కుల నాయకులు మెతుకు సత్యం, హరికృష్ణ, ఎలిగేటి శ్రీనివాస్, ఆంజనేయులు, గజవెల్లి కనకయ్య, వెల్దండి కనకయ్య అడిచర్ల శ్రీనివాస్, ఓడ్నాల రాజు, పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement