Tuesday, November 26, 2024

విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు

  • శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యా కేసు నమోదు చేయాలి
  • కార్పోరేటు విద్యా సంస్థలలో వరుస ఆత్మహత్యలపై న్యాయ విచారణ జర‌పాలి
  • ఏఐఎస్ బి రాష్ట్ర ప్రధానాకార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి

హైదరాబాద్ లోని కార్పోరేటు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ప్రథ‌మ సంవత్సరం చదువుతున్న నిమ్మల రమాదేవి ఆత్మహత్యకు కారుకులైన శ్రీ చైతన్య యాజమాన్యం పై హత్యాకేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా స్టుడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ.. మార్కులు, ర్యాంకుల కోసం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం విధ్యార్థులను తీవ్ర ఓత్తిడికి గురిచేస్తూ ఫలితాలే లక్ష్యంగా మానసిక వేదనకు గురిచేయడం బాదాకరం అని అన్నారు. కార్పొరేట్ కాళాశాలలో వారి లాభం కోసం తప్ప విద్యార్థి సంక్షేమం కోసం పట్టించుకోకుండ వ్యవహరిస్తున్నారని శ్రీ చైతన్య విద్యాసంస్థలో ఇది మొదటి ఆత్మహత్య కాదని, ఇలా ప్రతి సంవత్సరం ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేసేంతవరకు ఏఐఎస్ బి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం అని హెచ్చరించారు. ఈ ఘటనకు కారుకులైన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు మానసికా వేదనకు గురికాకుండా ఉండేందుకు ఆవగాహన సదస్సును నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐఎస్ బి నాయకులు రమేష్ యాదవ్, హరీష్,వినయ్, విజయ్,వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement