Friday, November 22, 2024

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు

విద్యార్థులు పట్టుదలతో చదువుల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యా బోధనతోపాటు విద్యార్థులకు రాజ్యాంగం ద్వారా సక్రమించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలను తెలియజేయాలన్నారు.

రాజ్యాంగం పరిధిలోనే పౌరులు జీవన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడినా రాజ్యంగం మేరకు శిక్షించబడతారన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని, జూనియర్‌ సివిల్‌ జడ్జి రాణీ, ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐ రాజేశ్‌, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement