Tuesday, November 19, 2024

వేరు చేసిన ప్లాస్టిక్, తడి,పొడి చెత్త మాత్రమే సేకరించాలి : మున్సిపల్ చైర్ పర్సన్ మమత రెడ్డి

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మున్సిపల్ పాత కార్యాలయంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు హాజరు సమయంలో పారిశుధ్య సిబ్బందితో చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి సమావేశమయ్యారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతిఒక్క సిబ్బంది ఇంట్లో నుండి సేకరించే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ కవర్లను వేరు చేసినటువంటి వాటిని మాత్రమే సేకరించాలని ఆదేశించారు. సిబ్బంది పనిలో అప్రమత్తంగా ఉండాలని బూట్లు, చేతికి గ్లౌజులు తప్పకుండా ధరించాలని సూచించారు. సిబ్బందికి కావాల్సిన పనిముట్లు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. మహిళలు ప్రతిరోజు తమ ఇండ్లలో వెళ్లే ప్లాస్టిక్ కవర్లు, చెత్తను వేరు వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు ప్రతి రోజు విధులకు హాజరు కావాలని, కారణం లేకుండా విధులకు గైర్హాజరు అయిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. వార్డు కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీ సహకారంతో చెత్తపై డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో కమీషనర్ మట్ట శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్ షాహీదా సాబీర్ ఖాన్, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి, రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, బిల్ కలెక్టర్ సతీష్, ఆల్కా జవాన్లు కరుణాకర్, మసీయోద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement