Friday, November 22, 2024

అక్కడ సెల్ఫ్ లాక్ డౌన్..

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమను తాము కాపాడేందుకు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్వీయ లాక్ డౌన్ అమలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడంతో స్వచ్ఛందంగా తమకు తామే లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పెద్దకురుమపల్లి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలు స్వీయ నిర్బంధం పాటించనున్నట్లు ప్రకటించారు. ఒకేసారి 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో లాక్డౌన్ విధించినట్లు సర్పంచ్ గంగమల్లయ్య వెల్లడించారు.

మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా కూడా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద మరోసారి కరోనా ఉధృతి తీవ్రం కావడంతో అధికారులతోపాటు గ్రామ ప్రజలు అప్రమత్తమై మహమ్మారి కట్టడికి ప్రయత్నాలు చేపట్టారు. ఎక్కడకు వెళ్లినా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని.. ప్రతీ ఒక్కరు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వీరి బాటలోనే పక్కనే ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement