Tuesday, November 19, 2024

యువత అభివృద్ధికి ఎస్సి సబ్‌ ఫ్లాన్..

ఇల్లంతకుంట: రాష్ట్రం ఏర్పడ్డాక దళిత వాడలు, వారి బతుకు దేరువులు ఎలా ఉన్నాయో స్వయంగా మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తెలుసుకున్నారు. మండలంలోని పత్తికుంటపల్లెలో వాడ వాడలా పర్యటించి, వారి బాగోగుల అడిగి తెలుసుకుని, వృద్ధులను ఆప్యాయతతో అవ్వ ఎలా ఉన్నావ్‌, పెన్షన్‌ వస్తుందా అని అడుగగా మురిసిన అవ్వ బిడ్డ నా పెద్ద కొడుకులా కేసీఆర్‌ పంపుతున్న పైసలు వస్తున్నాయని తెలిపింది. గతంలో పత్తికుంటపల్లె చెరువు నిర్మాణంలో ముంపుకు గురైన దళితుల భూముల కొంతమేరకు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అప్పుడే సంబంధిత అధికారి తహశీల్దార్‌ సోలిపురం రాజిరెడ్డితో ఫోన్‌లో సమస్య పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన ఎమ్మెల్యే వారితో అల్పాహారం చేశారు. ఎస్సి కుల యువతి, యువకుల అభివృద్ధి-కై- ప్రభుత్వం ఎస్సి సబ్‌ ఫ్లాన్‌ పథకం ప్రవేశపెట్టిందన్నారు. దళిత కాలనీలోని అంబేద్కర్‌ సంఘ భవనం ఆవరణలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ వచ్చే జూన్‌ మాసం నుండీ పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. ఈనెల 14న అంబెడ్కర్‌ జయంతి వేళ గ్రామంలోని అంబెడ్కర్‌ విగ్రహ ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు- చేయాలన్నారు. అన్ని కులాల అభివృద్ధి -కై- ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐలయ్య యాదవ్‌, సర్పంచ్‌ చింతలపల్లి శ్రీలత, మాజీ సర్పంచ్‌ జుట్టు- వినోద్‌ కుమార్‌, సంఘ సభ్యులు భాస్కర్‌, లక్ష్మణ్‌, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement