Saturday, November 23, 2024

స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తాం : మంత్రి గంగుల‌

సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ గౌడ సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌకులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హ‌జ‌ర‌య్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గౌడ కులంలో పుట్టిన బహుజనులందరి హక్కుల కోసం పోరాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అన్నారు. అందరి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. కానీ సమైక్య పాలనలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదు అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన నాయకున్ని గౌరవించాలని బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలని సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కు బడుగు బలహీన వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement