Tuesday, November 19, 2024

సాగు నీరుకోసం..

ముత్తారం: మండలంలోని రైతులకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం డిమాండ్‌ చేశారు. మండలంలోని ఖమ్మంపల్లి, రామకృష్ణపూర్‌, సీతంపల్లి గ్రామాలకు ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌లో తుంగ మట్టి పేరుకు పోయి సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో నాయకులు పరిశీలించారు. కెనాల్‌ లోని తుంగ మట్టి తీసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 2 టిఎంసి నీటిని విడుదల చేయాలన్నారు. తద్వారా మండలంలోని మచ్చుపేట గ్రామం నుండి చివరి ఆయకట్టు- గ్రామాలైన అడవి శ్రీరాంపూర్‌, ఓడెడ్‌ వరకు చివరి దశలో ఉన్న పంటలకు నీటిని అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ద్దొడ బాలాజీ, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, సర్పంచ్‌ తూటి రజిత రఫీ, యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షులు గాదం శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు బక్కతట్ల కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు కొల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement