నేర చరిత్ర గల వారు సత్ప్రవర్తనతో వుండాలని, లేకపోతే పీడీ యాక్ట్ పెడతామని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనా రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని జూలపల్లి, పొత్కపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో గల 49 మంది రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. మంచిగా జీవిస్తే భవిష్యత్తులో షీట్లు తొలగిస్తామని, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సైలు వెంకటకృష్ణ, లక్ష్మణ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital