ఎన్‌టీపీసీ: ఆర్‌ఎఫ్‌సిఎల్ జరుగుతున్న అవినీతి, అక్రమా దందాలను చూడవద్దని కళ్లు లేని కబోదిలా వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా అమరుల స్తూపం నుండి మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమ బ్రోకర్ల, అధికారుల, కాంట్రాక్టర్ల దందాలను కళ్లుండి చూస్తూ ఉండడం కంటే కళ్లకు గంతలు కట్టుకుని కబోదిలా ఉండడమే మేలన్నారు. యజమాన్యం అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ అక్రమంగా ఉద్యోగాల్లో దొడ్డిదారిన నియామకాలు చేపట్టడం అన్యాయమన్నారు. జేఏసి నిరసనల ద్వారా ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం సరికాదన్నారు. ప్రభావిత గ్రామాల ప్రజలు, నిరుద్యోగులను కలుస్తూ ఐక్య పోరాటాలతోనే సమస్య పరిష్కారమవుతుందని చైతన్యం తెస్తున్నామన్నారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. అనంతరం నిరసన దీక్ష కోసం అనుమతికి సిపి, ఏసిపిలకు మెమోరండం సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సల్ల రవీందర్, వెల్తురు మల్లయ్య, బొడ్డుపెళ్లి నారాయణ, జిఎన్ రావు, రత్నకుమార్, కన్నూరు శంకర్, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ, కరణ్, ఇమామ్, మహేందర్, అనిల్, రాజయ్య, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement