Friday, October 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖకు రూ.303.39 కోట్ల ఆదాయం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణాశాఖకు 2022-23 సంవత్సరానికి రూ.303.39 కోట్లు సమకూరిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. త్రైమాసిక పన్నుల ద్వారా రూ.58.78 కోట్లు, జీవితకాలపు పన్నుల ద్వారా రూ.184.48 కోట్లు, ఫీజుల ద్వారా రూ.40.48 కోట్లు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.9.40 కోట్లు, తనిఖీల రూపంలో రూ.10.25కోట్లు ఆదాయం చేకూరిందని తెలిపారు. జిల్లాల వారీగా కరీంనగర్ జిల్లాకు రూ.149.40 కోట్లు, జగిత్యాల జిల్లాకు రూ.50.96కోట్లు, పెద్దపల్లి జిల్లాకు రూ.69.97 కోట్లు, సిరిసిల్లా జిల్లాకు రూ.33.6 కోట్ల ఆదాయం సమకూరిందని చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ ఆదాయం 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2022-23 లో 54% వృద్ధి రేటు సాధించామని మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement