Saturday, November 23, 2024

ఆంధ్రప్రభ కథనానికి స్పందన .. చైతన్య బోర్డులుంటే చర్యలు

పేరు కేవీఆర్… నడిపించేది శ్రీచైతన్య పేరుతో… శ్రీచైతన్య విద్యాసంస్థల మోసాలపై ఆంధ్రప్రభ కరీంనగర్ జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ స్పందించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు దూస రఘుపతి మండల విద్యాధికారి ఎల్లారెడ్డిపేట్ మంగళవారం కేవీఆర్ పాఠశాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. శ్రీ చైతన్యకు అనుమతి లేదని, అడ్మిషన్లు కేవీఆర్ పేరుమీదనే నిర్వహించాలని ఆదేశించారు. చైతన్య బోర్డులు, బ్రోచర్లు ఉంచినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లితండ్రులు అనుమతి లేని శ్రీ చైతన్యలో తమ పిల్లలను చీపించవద్దని, అనుమతి ఉన్న స్థానిక గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించాలని ఎం ఈ ఓ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement