Monday, November 18, 2024

పూడూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి రాత్రి బస

కొండగట్టు – . సోమవారం ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామి నీ దర్శించుకొని కొడిమ్యల మండల కేంద్రానికి వెళ్ళి బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పోతారం చెరువు సందర్శించి అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు లను పరిశీలించి గ్రామస్తుల సమస్యలు విన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ పై చార్జ్ షీట్ ను ,చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్మేడిపల్లి సత్యం విడుదల చేశారు.…తొమ్మిదేళ్లయినా పోతారం రిజర్వాయర్ పనులు ఎమ్మెల్యే పూర్తి చేయలేకపోయారనారురెండుసార్లు బీఆరెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినా నియోజకవర్గానికి చేసిందేం లేదన్నారు.నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారనారు నారాయణ పూర్ పంప్ హౌస్ కు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరినా ఎమ్మెల్యే మనసు కరగలేదనారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిందేం లేదనారు. మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అనారు.వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీ దే అన్నారు. ఆనంతరం పూడుర్ నుండి గంగాధర చౌరస్తా వరకూ పాదయాత్ర గా తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో mlc జీవన్ రెడ్డి ,పొన్నం ములుగు ఎమ్మెల్యే సితక్క , మాజీ ఎంపీ పొన్నo ప్రభాకర్ లు పాల్గొన్నారు. రాత్రికి పూడూర్ గ్రామంలో రేవంత్ రెడ్డీ బస చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement