సేవా రంగంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ లయన్స్‌లో గత 20 ఏండ్లుగా నిస్వార్థ, సమాజహిత సేవలను అందిస్తున్న శాతవాహన లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడు లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిని ప్రతిష్టాత్మక మైల్‌స్టోన్ చెవరాన్ అవార్డు వరించడం సముచితంగా ఉందని క్లబ్ నాయకులు అన్నారు.
రసాయనశాస్త్ర సహ-ఆచార్యులు, ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, ఎన్‌సిసి కంపెనీ కమాండర్, లయన్స్ జిల్లా అదనపు కార్యదర్శి, కవి, పాఠ్యపుస్తక రచయిత, కాలమిస్టు, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ట్రేయినర్, తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం అధ్యక్షుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు లాంటి బహుముఖ రంగాల్లో తన సత్తా చాటుతూ గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సన్మానాలు, పురస్కారాలు, ప్రసంశలు పొందిన లయన్ మధుసూదన్ రెడ్డికి అంతర్జాతీయ లయన్స్ సంస్థ అధ్యక్షురాలు లయన్ డా పట్టీ హిల్ ఎంపిక చేసిన పంపించిన “మైల్‌స్టోన్ చెవరాన్ అవార్డు”ను జిల్లా గవర్నర్ లయన్ హనుమాండ్ల రాజిరెడ్డి అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కెబినెట్ సెక్రెటరీ లయన్ ఎం వి రమణారెడ్డి, క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోషాధికారులు లయన్ వై శేఖర్ రావు, లయన్ ఎం మహెందర్, లయన్ కె సత్యం, పూర్వ రీజియన్ చైర్మన్లు లయన్‌రాజెందర్ రెడ్డి, లయన్ ఎన్ ప్రసాద రావు, లయన్ బి నర్సింగ రావు, లయన్ ఇనుగుర్తి రమేష్, ఆర్‌సి లయన్ జి లక్ష్మయ్య, జెడ్‌సి లయన్ సంపత్ కుమారి, పూర్వ జోన్ చైర్మన్లు లయన్ వి జగదీశ్వరాచారి, లయన్ జె సి ప్రకాష్, లయన్ ఎం సత్యనారాయణ రావు, గౌరవ పూర్వ అధ్యక్షులు, ప్రాధమిక సభ్యులు లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.