Sunday, November 10, 2024

చెన్నూరులో శ‌ర‌వేగంగా అభివృద్ధి పనులు.. మారుతున్న రూపు రేఖలు

చెన్నూరు నియోజకవర్గం.. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరం.. కనీస సౌకర్యాలు లేక అల్లాడిన జనం.. ఓట్ల సమయంలో తప్ప ప్రజల బాగోగులు చూడని పాలకులు.. కానీ అది నాటిమాట.. ప్రస్తుతం చెన్నూరు ఆదర్శ నియోజకవర్గం.. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు.. అందుబాటులోకి మౌలిక సదుపాయాలు.. నిత్యం ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్న నాయకుడు.. 2014 ముందు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండేది.. ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలుపొందడమే తరువాయి చెన్నూరు అభివృద్ధి పై దృష్టి సారించారు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిత్యం నియోజకవర్గ ప్రజలకు అదృష్టంగా మారింది..

50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపాడు చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానన్ని నిధులు చెన్నూరు నియోజకవర్గానికి తెచ్చి సఫలీకృతమయ్యారు. నిధులు తేవడమే కాదు అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు.. ఈనెల 15న ఒకేరోజు 210 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆర్థిక మంత్రి హరీష్ రావుతో చేయించడంతో నియోజకవర్గం తీరు మారింది అనేందుకు నిదర్శనం. నాణ్యమైన రోడ్లు, మంచినీటి వసతులు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, ఆర్ఓబీలు, వంతెనలు, పార్కులు, మినీ ట్యాంక్ బండ్ లు, విజ్ఞాన కేంద్రాలు, మహిళా భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నాటికి నేటికి ఎంత తేడా అని మురిసిపోతున్నారు. 2014 ముందు పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి తేడాను గుర్తు చేసుకుంటున్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బాల్క సుమన్ కు నీరాజనాలు పలుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement